రైతులు భూసారాన్ని పెంచేలా అవగాహన కల్పించాలి : కలెక్టర్ కుమార్ దీపక్ 

రైతులు భూసారాన్ని పెంచేలా అవగాహన కల్పించాలి : కలెక్టర్ కుమార్ దీపక్ 

నస్పూర్, వెలుగు: రైతులు భూసారాన్ని పెంచడంతోపాటు వాణిజ్య, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి అధిక ఆదాయం పొందేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లో జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, ఉద్యానవన శాఖ అధికారి అనిత, మ్యాట్రిక్స్ సీఈవో ఉదయ్​కుమార్​తో కలిసి వ్యవసాయ డివిజనల్ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, ఉద్యానవన పట్టు పరిశ్రమశాఖ అధికారులు, సూక్ష్మ నీటిపారుల శాఖ జిల్లా సమన్వయకర్తలతో రివ్యూ నిర్వహించారు.

ఎప్పుడూ వరి సాగు చేయడం వల్ల భూసారం దెబ్బతింటుందన్నారు. పంట మార్పిడి విధానాన్ని అవలంభించడం ద్వారా భూసారం పెంపొందించడంతో పాటు భూగర్భ జలాలను కాపాడుకోవచ్చని తెలిపారు. పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, కాయగూరలు, ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా అధిక దిగుబడితో ఆదాయం పొందవచ్చన్నారు. ప్రతి ఏటా పంట సాగు ప్రారంభం ఆలస్యం కావడంతో అకాల వర్షాల కారణంగా నష్టం జరుగుతోందని, ముందుస్తుగా సాగు ప్రారంభించి ప్రకృతి వైపరరీత్యాల నష్టాల నుంచి బయట పడవచ్చని తెలిపారు. 

భూభారతి దరఖాస్తులు పరిష్కరించేలా చర్యలు

జైపూర్(భీమారం), వెలుగు: భీమారం మండల కేంద్రంలో నిర్మిస్తున్న ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్ పనులు త్వరగా పూర్తిచేసేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శుక్రవారం భీమారం మండలంలో పర్యటించిన ఆయన మండల ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులు, అంకుశాపూర్, కొత్తపల్లి గ్రామాల్లో జరుగుతున్న భూభారతి సదస్సులు, మద్దికల్ లో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లు, స్కూళ్లలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాపులను పరీశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

భూభారతి సదస్సుల్లో దరఖాస్తులను స్వీకరించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంకూషాపూర్​లోని సమత ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు సెంటర్ల నుంచి వచ్చిన ధాన్యం లోడ్​ను వెంటనే అన్ లోడ్ చేసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్  ​వెంట తహసీల్దార్ సదానందం ,స్పెషల్ ఆఫీసర్ కృష్ణ, సిబ్బంది ఉన్నారు.